Search This Blog

27 September 2013

Go.425 Dt.27/9/2013 Payment of salaries under 010 head for Municipal corporation teachers of VJA,VIJAG

GO NO.3529 Dt.27/9/2013 permission to DTA,HYD to pay 13Andhra dt. salary claims of DDOs

SSC fees schedule

UTF state leaders meeting with PRC commission

14 September 2013

Our political leaders black money in Swiss banks

New method introduced by Central govt to calculate DA


సిపిఐ ఫార్ములా మార్పుతో డిఏ'కు ఎసరు?  వేతన జీవులు పనిచేసేందుకు అవసరమైన అవసరాలు తీర్చేందుకు మాత్రమే యజమానులు వేతనాలు ఇస్తున్నారు తప్ప వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వటం లేదు. దీన్ని కూడా ఎప్పటికప్పుడు తగ్గించేందుకు లేదా అంగీకరించిన దానికి కోత పెట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అది వ్యక్తులుగా ఉన్నా ప్రభుత్వాలైనా యజమానుల స్వభావం అది. ఈ క్రమంలోనే కరువు భత్యం లెక్కింపునకు ప్రధాన ఆధారమైన వినియోగదారుల ధరల సూచిక(సిపిఐ) మార్పు ద్వారా చెల్లించాల్సిన దానిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఆ ఫార్ములా ప్రయివేటు రంగానికి కూడా వర్తిస్తుంది కనుక వారి వత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కరువు భత్యం ఇచ్చే పద్దతిని ఆరునెలలకు ఒకసారికి మార్చి ప్రభుత్వం పొదుపు చేసింది. రానున్న రోజుల్లో ఏడాదికి ఒకసారి చేస్తుందా? తప్పుడు లెక్కలతో అసలుకే ఎసరు పెడుతుందో చూడాల్సి ఉంది.  వినియోగదారుల ధరల సూచికను దిగువ అంశాల ప్రాతిపదికగా లెక్కిస్తారు. గణాంక మరియు పోస్టల్‌ శాఖల ద్వారా 252 వస్తువుల మార్కెట్‌ ధరలను 78 కేంద్రాల నుంచి ప్రభుత్వ సిబ్బంది సేకరిస్తారు.  ఈ వస్తువులను కొన్ని తరగతులుగా విభజిస్తారు. మొత్తం వందపాయింట్లు అనుకుంటే ఆహార వస్తువులకు 49.71, గృహ 9.77, ఇంథనం 9.49, రవాణా 7.5, వైద్యం 5.31, వ్యక్తిగత సంరక్షణ 2.96 మిగతావాటన్నింటికీ కలిపి 26.99శాతం చొప్పున వెయిటేజ్‌ ఇస్తారు.  ప్రభుత్వం సేకరించే లెక్కలకు, వాస్తవ మార్కెట్‌ ధరలకు అత్యధిక వస్తువుల విషయంలో చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వం పేర్కొనే ఇంటి అద్దెలకు గ్రామాల్లో కూడా ఇళ్లు దొరకటం లేదనే విషయం తెలిసినదే. పట్టణాలు,గ్రామాలలో వస్తువుల ధరల సగటును ప్రమాణంగా తీసుకొని వెయిటేజ్‌ ఇవ్వటం కూడా ఒక లోపమే. అందుకే గృహ, వైద్య ఖర్చుల వెయిటేజ్‌ను 15శాతం చొప్పున పెంచాలని, ఇతరాలను ఐదుశాతానికి తగ్గించాలని వేతన జీవులు కోరుతున్నారు.  గత ఆరున్నర సంవత్సరాలలో ధరలు 200శాతం పెరిగాయి. ఇదే సమయంలో సిపిఐ 115 నుంచి 245కు పెరిగింది. అంటే 120 పాయింట్లు పెరిగితే కరువు భత్యం పెరుగుదల 92శాతమే. డిఏ ఫార్ములా లెక్కింపులో ఉన్న లోపమే దీనికి కారణం. ఇతర వస్తువులుగా పేర్కొన్నవాటికి 26శాతం వెయిటేజ్‌ ఇవ్వటం వలన వాస్తవ పెరుగుదలను ఇది దెబ్బతీస్తున్నది.  కేంద్ర ప్రభుత్వ లేబర్‌ బ్యూరో ప్రస్తుతం ఉన్న 2001=100 ప్రాతిపదికను 2013-2014=100గా చేయాలని ప్రతిపాదించింది. కార్మికవర్గ వినియోగతీరు తెన్నులలో మార్పులు జరుగుతున్నందున వాటికి అనుగుణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రాతిపదిక సూచికను మార్చాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొన్నది.  ప్రస్తుతం అమలులో ఉన్న సిరీస్‌ నమోదైన ఫ్యాక్టరీలు, గనులు, తోటలు,రేవులు, ప్రజారవాణా, విద్యుత్‌, రైల్వే రంగాలలో ఉన్న ఉపాధి సమాచారం అధారంగా నిర్ణయించారు.  సూచిక సమీక్ష కమిటీ సిఫార్సుల ప్రకారం చేనేత, నిర్మాణరంగాల ఉపాధిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత 78 కేంద్రాలను 88-95 వరకు పెంచాలని లేబర్‌ బ్యూరో ప్రతిపాదించింది. సర్వేలో కుటుంబాల సంఖ్యను 50 నుంచి 70వేలకు పెంచాలన్నది మరొక ప్రతిపాదన. ఇలాంటి వాటితో తిమ్మిని బమ్మిని చేసి కరువు భత్య భారాన్ని తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ దురాలోచన.  ఈ ఏడాది విపరీతంగా ధరల పెరుగుదల కారణంగా జనవరి-జూన్‌ మధ్య కేంద్ర కరువు భత్యం పదిశాతం పెరిగింది. జులైలో ధరల పెరుగుదలతో వచ్చే జనవరి నుంచి మరోపదిశాతం అంతకు మించి పెరగనుంది. అంటే ఏడాదికి 20శాతం. ఈ స్థితిలో దీన్ని కనీసం సగానికి తగ్గించాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వత్తిడి తెస్తున్నాయి. అందుకుగాను సిపిఐ నిర్ణయంలో వస్తువులకు ఇస్తున్న వెయిటేజ్‌లో ముఖ్యంగా 49.71శాతంగా ఉన్న ఆహారాన్ని 30శాతానికి తగ్గించటం వంటి మార్పులు చేయాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. అంటే ఆహార వస్తువుల ధరలు ఎంత పెరిగినా పరిమితంగానే పరిగణనలోకి తీసుకుంటారు.
సిపిఐ ఫార్ములా మార్పుతో డిఏ'కు ఎసరు?
వేతన జీవులు పనిచేసేందుకు అవసరమైన అవసరాలు తీర్చేందుకు మాత్రమే యజమానులు వేతనాలు ఇస్తున్నారు తప్ప వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వటం లేదు. దీన్ని కూడా ఎప్పటికప్పుడు తగ్గించేందుకు లేదా అంగీకరించిన దానికి కోత పెట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అది వ్యక్తులుగా ఉన్నా ప్రభుత్వాలైనా యజమానుల స్వభావం అది. ఈ క్రమంలోనే కరువు భత్యం లెక్కింపునకు ప్రధాన ఆధారమైన వినియోగదారుల ధరల సూచిక(సిపిఐ) మార్పు ద్వారా చెల్లించాల్సిన దానిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఆ ఫార్ములా ప్రయివేటు రంగానికి కూడా వర్తిస్తుంది కనుక వారి వత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కరువు భత్యం ఇచ్చే పద్దతిని ఆరునెలలకు ఒకసారికి మార్చి ప్రభుత్వం పొదుపు చేసింది. రానున్న రోజుల్లో ఏడాదికి ఒకసారి చేస్తుందా? తప్పుడు లెక్కలతో అసలుకే ఎసరు పెడుతుందో చూడాల్సి ఉంది.
వినియోగదారుల ధరల సూచికను దిగువ అంశాల ప్రాతిపదికగా లెక్కిస్తారు. గణాంక మరియు పోస్టల్‌ శాఖల ద్వారా 252 వస్తువుల మార్కెట్‌ ధరలను 78 కేంద్రాల నుంచి ప్రభుత్వ సిబ్బంది సేకరిస్తారు.
ఈ వస్తువులను కొన్ని తరగతులుగా విభజిస్తారు. మొత్తం వందపాయింట్లు అనుకుంటే ఆహార వస్తువులకు 49.71, గృహ 9.77, ఇంథనం 9.49, రవాణా 7.5, వైద్యం 5.31, వ్యక్తిగత సంరక్షణ 2.96 మిగతావాటన్నింటికీ కలిపి 26.99శాతం చొప్పున వెయిటేజ్‌ ఇస్తారు.
ప్రభుత్వం సేకరించే లెక్కలకు, వాస్తవ మార్కెట్‌ ధరలకు అత్యధిక వస్తువుల విషయంలో చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వం పేర్కొనే ఇంటి అద్దెలకు గ్రామాల్లో కూడా ఇళ్లు దొరకటం లేదనే విషయం తెలిసినదే. పట్టణాలు,గ్రామాలలో వస్తువుల ధరల సగటును ప్రమాణంగా తీసుకొని వెయిటేజ్‌ ఇవ్వటం కూడా ఒక లోపమే. అందుకే గృహ, వైద్య ఖర్చుల వెయిటేజ్‌ను 15శాతం చొప్పున పెంచాలని, ఇతరాలను ఐదుశాతానికి తగ్గించాలని వేతన జీవులు కోరుతున్నారు.
గత ఆరున్నర సంవత్సరాలలో ధరలు 200శాతం పెరిగాయి. ఇదే సమయంలో సిపిఐ 115 నుంచి 245కు పెరిగింది. అంటే 120 పాయింట్లు పెరిగితే కరువు భత్యం పెరుగుదల 92శాతమే. డిఏ ఫార్ములా లెక్కింపులో ఉన్న లోపమే దీనికి కారణం. ఇతర వస్తువులుగా పేర్కొన్నవాటికి 26శాతం వెయిటేజ్‌ ఇవ్వటం వలన వాస్తవ పెరుగుదలను ఇది దెబ్బతీస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ లేబర్‌ బ్యూరో ప్రస్తుతం ఉన్న 2001=100 ప్రాతిపదికను 2013-2014=100గా చేయాలని ప్రతిపాదించింది. కార్మికవర్గ వినియోగతీరు తెన్నులలో మార్పులు జరుగుతున్నందున వాటికి అనుగుణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రాతిపదిక సూచికను మార్చాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొన్నది.
ప్రస్తుతం అమలులో ఉన్న సిరీస్‌ నమోదైన ఫ్యాక్టరీలు, గనులు, తోటలు,రేవులు, ప్రజారవాణా, విద్యుత్‌, రైల్వే రంగాలలో ఉన్న ఉపాధి సమాచారం అధారంగా నిర్ణయించారు.
సూచిక సమీక్ష కమిటీ సిఫార్సుల ప్రకారం చేనేత, నిర్మాణరంగాల ఉపాధిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత 78 కేంద్రాలను 88-95 వరకు పెంచాలని లేబర్‌ బ్యూరో ప్రతిపాదించింది. సర్వేలో కుటుంబాల సంఖ్యను 50 నుంచి 70వేలకు పెంచాలన్నది మరొక ప్రతిపాదన. ఇలాంటి వాటితో తిమ్మిని బమ్మిని చేసి కరువు భత్య భారాన్ని తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ దురాలోచన.
ఈ ఏడాది విపరీతంగా ధరల పెరుగుదల కారణంగా జనవరి-జూన్‌ మధ్య కేంద్ర కరువు భత్యం పదిశాతం పెరిగింది. జులైలో ధరల పెరుగుదలతో వచ్చే జనవరి నుంచి మరోపదిశాతం అంతకు మించి పెరగనుంది. అంటే ఏడాదికి 20శాతం. ఈ స్థితిలో దీన్ని కనీసం సగానికి తగ్గించాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వత్తిడి తెస్తున్నాయి. అందుకుగాను సిపిఐ నిర్ణయంలో వస్తువులకు ఇస్తున్న వెయిటేజ్‌లో ముఖ్యంగా 49.71శాతంగా ఉన్న ఆహారాన్ని 30శాతానికి తగ్గించటం వంటి మార్పులు చేయాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. అంటే ఆహార వస్తువుల ధరలు ఎంత పెరిగినా పరిమితంగానే పరిగణనలోకి తీసుకుంటారు.

Harish RAO goondagiri

Railway SMS no