Search This Blog

31 October 2013

JAC memorandum to CM on 29/10/2013

29 October 2013

Go.298 dt.29/10/2013 Advance salary 2months to APNGO s and Gazitted officers

27 October 2013

harish giri

23 October 2013

U DISE FORMAT 2013-14

CCE New general module 2013-14

New text books primary teachers Telugu hand book for classes fourth and fifth

New text books Primary teachers Maths hand book for fourth and fifth classes

New text books Primary teachers EVS karadeepika

New text books Primary teachers English hand book

COS-Class room observation schedule format To be filled by SCX HM

SMF- SCHOOL MONITORING FORMAT for QMF

CCE Children progress report model calculation -New

20 October 2013

Rc.No.31 dt.19/10/2013 strike days compensate days

Article 371D

371-డి: రాష్ట్ర సమైక్యతకు శ్రీరామ రక్ష! విభజన వాదంపై బ్రహ్మాస్త్రం! విభజన వాద స్కందావారాన్ని నిలువునా కుదిపేసింది 371-డి అధికరణం. టీ శ్రేణులన్నీ వణికి పోయాయి. ఇది సీమాంధ్రుల కుట్ర - అని మొదట తీవ్రంగా విరుచుకు పడ్డాయి. 371 డి అంటే ఏమిటో చదివిన తర్వాత, విపరీతంగా కంగారు పడ్డాయి. ఆ తర్వాత బుకాయింపులు మొదలయ్యాయి. అది తెలంగాణాకు అడ్డం కాదన్నారు. అది సీమాంధ్రులే ఉంచుకోవచ్చన్నారు. తర్వాత అది మాకు కూడా కావాలన్నారు. ఆర్టికల్ 3 కంటే అది గొప్పదేమీ కాదన్నారు. ఆర్టికల్ 4 లో రెండో సెక్షన్ ముందు అది దిగదుడుపే అన్నారు. 371-డి మొత్తం మార్చాల్సిన అవసరం లేదు - 'తెలంగాణాకి' అన్న ఒక్క మాట చేరిస్తే చాలు అన్నారు. ఆ నాలుగు అక్షరాల మాట చేర్చడానికి 2/3 వంతు పార్లమెంటు తీర్మానం అవసరం లేదన్నారు. బొంబాయోళ్ళకి, పంజాబోళ్ళకి అవసరమొచ్చినప్పుడు - రాజ్యాంగ సవరణ చెయ్యలేదు; తెలంగాణా వాళ్లకి అవసరమైతే సవరణ కావాలనడం కేవలం సీమాంధ్రుల దుష్ప్రచారం అన్నారు. 371-డి 9వ పేరాలో ఒక హంసపాదు వేసి, 'తెలంగాణాకి' అని రాస్తే సరిపోతుంది - ఆ మాత్రం దానికి అదేదో బ్రహ్మాస్త్రం అని సీమాంధ్రులు చెప్పడం మోసం అన్నారు. 371-డి లో కామా కూడా మార్చ లేరు! 371-డి రాజ్యాంగ అధికరణం. రాజ్యాంగానికి 32వ సవరణ ద్వారా 371-డి ఏర్పడింది. అంటే, ఆ రోజు 2/3వ వంతు పార్లమెంటు సభ్యులు ఆమోదం తెలపడం ద్వారా అది ప్రాణం పోసుకొంది. పైగా పదో క్లాజులో దానికి అపార బలం, శాశ్వతత్వం చేకూర్చారు. ఈ అధికరణం రాజ్యాంగంలోని అన్ని అధికరణాలకు మిన్నగా ఉంటుందని స్పష్టం చేసారు. ఈ అధికరణం 7వ షెడ్యూలులో భాగం. ఈ ఈ షెడ్యూలులోని ఏ అధికరణంలో మార్పు చేయాలన్నా 368 ప్రకారం 2/3 మెజారిటీతోనే సాధ్యం! 371-డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఉద్యోగాలు, విద్యా అవకాశాలకు మాత్రమే వర్తిస్తుంది. నిజానికి ఇది, విద్యా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జోన్లవారీ, స్థానికులు - స్థానికేతరులకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన అధికరణం. 69లో ముల్కీ ఉద్యమం, 72లో జై ఆంద్ర ఉద్యమం వచ్చినప్పుడు - అవి తెలుగు ప్రజల మధ్య వైమనస్యం పెంచినప్పుడు - ఒక శాశ్వత పరిష్కారంగా, అందరి అంగీకారంతో - ఏర్పడినదే 371-డి! ఈ అధికరణం ద్వారా ఇచ్చే స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగంలోని అనేక అధికరణాలకు వ్యతిరేకం. కనుక - మరో ప్రత్యేక రాజ్యాంగ ఆధికరణం చెయ్యవలసి వచ్చింది. విస్తృతమైన చర్చ జరిపి, పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో ఆమోదం తెలిపింది. తెలుగు ప్రజల సమైక్యతకు, రాష్ట్ర సమగ్రతకు భారతదేశం ఇచ్చిన గట్టి హామీ ఈ అధికరణం! ఇది మరో రకంగా ఆంధ్రప్రదేశ్ కలకాలం సమైక్యంగా ఉండటానికి భాట దేశం వెలిబుచ్చిన మహాదాకాంక్ష! 371-డి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు హామీ! గత 40 సంవత్సరాలుగా యావదాంధ్ర దేశం ఈ అధికరణానికి అనుగుణంగానే తన జీవన గతిని, ధ్రుతినీ మార్చుకొంది. లక్షలాది కుటుంబాలు ఈ అధికరణం ప్రాతిపదికపైనే తమ భవిష్యత్తును రూపొందించుకున్నాయి. ఈ అధికరణం పెట్టని కోటగా నిలిచి ఉన్నందువల్లనే, విభజన ఉద్యమాలను ఎవ్వరూ లెక్క చెయ్య లేదు! ఈ రాష్ట్ర సమగ్రతకు, ఐక్యతకు దృఢమైన రాజ్యాంగ రక్షణ ఛత్రం ఆసరాగా ఉన్నప్పుడు ఎన్నికల రాజకీయాలకు సంబంధించిన ఉద్యమాలను పట్టించుకోవలసిన అవసరం ఏముంది? కానీ నాలుగు దశాబ్దాలుగా ఏ చుక్కాని ఆధారంగా కోట్లాది ప్రజలు తమ జీవన నౌకను సజావుగా నడుపుకుంటున్నారో, ఆ ఆధార స్థంభాన్నే కూల్చేస్తామంటే అంగీకరిస్తారా? అందుకే సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున రగిలింది. ఇది కేవలం ఒక రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కాదు! 371-డి బదులు రేపు మరో 371-పి తేవచ్చు! హైదరాబాదును సకల ప్రజలకూ రాజధానిగా అంగీకరిస్తూ ఇచ్చిన గ్యారంటీ రద్దు చేస్తారా? ఇది ఒక ప్రాంత ప్రజలకు సరాసరి అన్యాయం కాదా? హైదరాబాదు అందరి రాజధాని అనుకోని 4 దశాబ్దాలుగా రూపొందించుకున్న జీవన ప్రణాలికను కుదేలు చేస్తారా? అంతకుమించి, రాష్ట్ర సమైక్యతకు, సమగ్రతకు ఇచ్చిన హామీ ఏమవుతుంది? భారత దేశం దీనికి సమాధానం చెప్పాలి? జాతీయ సమగ్రతకు ఇది భంగకరం కాదా? కోట్లాది ప్రజల శ్రేయోభాగ్యానికి ఇది హానికరం కాదా? పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో 371-డి ని రద్దు చెయ్యవచ్చుగాక! కానీ, అట్టి రద్దు లేవనెత్తే ప్రశ్నలకు అది సమాధానం చెప్పాలి. 371-డి రద్దును ప్రతిపాదించే వాళ్ళు అది ఎట్లా న్యాయబద్ధమో తేల్చి చెప్పాలి. రాజకీయ పార్టీల నుంచి సేకరించిన ప్రేమ లేఖలతో రాష్ట్ర విచ్చిత్తికి పూనుకున్న వాళ్ళు, 371-డి ని ఎవరిచ్చే ప్రేమ లేఖలతో రద్దు చేస్తారో చెప్పాలి! రాష్ట్ర విచ్చిత్తికి కేవలం రాజకీయ నిర్ణయం చాలు, ప్రజాభిపాయంతో పని లేదన్న వాళ్ళు, 371-డి రద్దుకు కూడా రాజకీయ నిర్ణయం - అధినేత్రి నిర్ణయమే - సరిపోతుందా అనేది చెప్పాలి. ప్రజాభిప్రాయం అవసరం లేకుండానే - భారత దేశ నిర్ణయం లేకుండానే రాజ్యాంగం ఎట్లా తిరగ రాస్తారో చెప్పాలి! ప్రతిపక్షం, ప్రతిపక్షం కలసి - రాజకీయ ప్రయోజనం కోసం - ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా, తేల్చి చెప్పాలి! "డీ" ని ఢీ కొట్ట లేరు! రాష్ట్ర విచ్చిత్తికి కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా కాంగ్రెస్ అధిష్టానం బరితెగించిన పద్ధతిని చూసిన జన సామాన్యం మేల్కొంది. పల్లెలు, పట్టణాలు లేచి నిల్చున్నాయి. ఈ నేపథ్యంలో 371-డి కి ఇప్పుడు ఎనలేని బలం వచ్చింది. విభజన వాదులు ప్రచారం చేసిన అబద్ధాలు, అవాస్తవాలు, రేపిన విద్వేషం, చిమ్మిన విషం 371-డి ని మరింత అపురూపంగా మార్చేశాయి. దీని అర్థం, పరమార్థం అనంతంగా వ్యాపించాయి. ఇది సమైక్య ఆంధ్రకు ప్రత్యామ్నాయ పదంగా మారిపోయింది. 371-డి రక్షణకు జనం సన్నద్ధం అవుతున్నారు. ఇప్పడు అన్తుకోండి చూద్దాం - 371 డి ని! 371-డి - ఇది యావద్భారత దేశం సాక్షిగా తరతరాలకూ మనం చేసుకున్న ఒప్పందం! దిగ్బంధ, నిర్బంధాల, విష విద్వేషాల రాజకీయం నడిపి, తెలుగు ప్రజలను చీల్చే ప్రమాదం రాకుండా, రాష్ట్ర సమగ్రత విచ్చిన్నం కాకుండాకట్టిన రక్షాబంధనం ఇది! ఈ సందేశం ఊరూ, వాడా - ప్రతి బడిలో గుడిలో వ్యాపింప చేద్దాం! సమైక్యతకు ఇది శ్రీరామ రక్ష! విధ్వంస శక్తులపై ఇది బ్రహ్మాస్త్రం!! Other Posts on 371-D >> http://goo.gl/sVW3H4 http://goo.gl/xgVFwR http://goo.gl/Gqt8Gu http://goo.gl/Vmg2KZ http://goo.gl/j6uhWW What is 371D >> http://indiankanoon.org/doc/1466428/ http://www.indiantelugujaati.com/article-371d.html

16 October 2013

The ceded districts and the circar Dt and theNijam

Please read a book 100 lies behind the telangana udyamam

Article371D -a hurdle in bifurcation of AP


ఆర్టికల్ 371(డి) ని ముట్టుకుంటే కాటేస్తుంది!

ఆర్టికల్ 3 ఆంధ్ర ప్రదేశ్ విషయంలో - ఒక అత్తిపత్తి మొక్క లాంటిది. ముట్టుకుంటే ముడుచుకు పోతుంది. దానికి ఆ లక్షణం ఆర్టికల్ 371-డి వలన వచ్చింది. 371డి - ఆర్టికల్ 3 నెత్తి మీద కూర్చుంది-శివుడి తల మీది పాములా. శివుడాజ్ఞ లేకపోయినా చీమ కుట్టవచ్చు కానీ, 371-డి ని కాదని ఆర్టికల్ 3 ముందుకు కదలదు! కాదని ముట్టుకొంటే, 371-డి బుస్సు మని పడగ విప్పుతుంది. ఇప్పుడీ 371డి - విషయంలో కేంద్రం ఏమి చెయ్యబోతోంది? ఏమి చెయ్య బోతున్నారో తేల్చి చెప్పమని ముఖ్యమంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఆ మేరకు సీయస్ మహంతి కేంద్రానికి లేఖ రాశారు. అటునుంచి ఇంతవరకు ఉలుకూ పలుకూ లేదు!

1973లో రాజ్యాంగానికి చేసిన 32వ సవరణ వలన 371-డి అధికరణ వచ్చింది. జూలై 1974 నుంచి అది అమలులోకి వచ్చింది. 371(1) రద్దు చేసి 371డి అమలులోకి తెచ్చారు. మళ్ళీ దాన్ని మార్చాలన్నా, రద్దు చెయ్యాలన్న - కేవలం - రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వీలవుతుంది. అందునా, అట్లాంటి మార్పులు చేర్పుల వలన ప్రభావితమయ్యే అసంఖ్యాక ప్రజానీకం వ్యతిరేకించేటప్పుడు - రాజ్యాంగ సవరణ ఆషామాషీగా చెయ్యడానికి వీలు కాదు. రాజ్యాంగ సవరణ అంటే - పార్లమెంటులోని 2/3 వంతు ఆధిక్యం కావాలి. పార్లమెంటు ముగిసిపోతున్న వేళ ఇప్పుడీ రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యే పని కాదు!

371డి ఇప్పటికే రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చింది. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ 'ఒకే రాష్ట్రం' కాదు. ఇది ఆరు ఉప రాష్ట్రాల సమాఖ్య. అందులో హైదరాబాద్ ఫ్రీ జోన్. అంటే - తెలుగువాళ్ళందరికీ శాశ్వత రాజధాని. ఈ శాశ్వత ఏర్పాటుకు గ్యారంటీ ఇచ్చింది 1956 రాష్ట్రాల ఏర్పాటు చట్టం. కాబట్టి - రాష్ట్ర విభజన అంటే - కేవలం పరిపాలనా పరమైన అంశం కాదు. ఇది ప్రజల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమూ అందుకు సాహసించ లేదు, కూడదు!

371డి- ఏమంటోంది: “the provisions of this Article and of any order made by the President thereunder shall have effect notwithstanding anything in any other provision of this Constitution or in any other law for the time being in force.” కాబట్టి ఇతరత్రా చట్టలన్నిటికీ అతీతంగా 371-డి పని చేస్తుంది.

కొంతమంది అంటున్నారు: 371-డి కేవలం తెలంగాణా కోసం పెట్టిన చట్టం కనుక తెలంగాణా వాళ్ళందరూ ఒప్పుకుంటే, దాన్ని పక్కన పెట్టవచ్చని. తెలంగాణా వాళ్ళందరూ - 4 కోట్ల మందీ - సంతకాలు పెట్టినా, దాన్ని పక్కన పెట్టగలరా అన్న విషయం అట్లా ఉంచుదాం. నిజానికి 371డి - కేవలం తెలంగాణా సోదరుల కోసమే చేసిన చట్టం కాదు. అది - రాష్ట్రంలో విద్యా ఉద్యోగ విషయాల విషయంలో ప్రజలందరికీ వర్తించే ఒక ప్రత్యేక ఏర్పాటు! 610 జీవో దాని ఆధారంగానే వచ్చింది. 371-డి - ఇలా మొదలవుతోంది: The President may by order made with respect to the State of Andhra Pradesh provide, having regard to the requirements of the State as a whole, for equitable opportunities and facilities for the people belonging to different parts of the State, in the matter of public employment and in the matter of education, and different provisions may be made for various parts of the State.

ఇప్పుడు - 371డి ని - ఉన్నఫళంగా రద్దు చెయ్యడానికి కూడా కుదరదు! 371డి - ఇచ్చిన హక్కులునిరాకరించడం ప్రభుత్వం ఇష్టారాజ్యం కాదు. ప్రజల వ్యతిరేకత మరచి నిరంకుశంగా వ్యవహరించే బలం లేని అర్భక ప్రభుత్వం ఇది. కాబట్టి ఇది 371-డి ని ముట్టుకోలేదు! దీనిపై అభిప్రాయం చెప్పడానికే ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు! 371-డి విషయంలో ఏమి చేసేదీ చెప్పడానికి సమయం తీసుకోవచ్చు - కానీ - ఉపేక్షించడానికి వీలు లేని '6 ముళ్ళ బంధం' 371డి! కాబట్టే - ఆర్టికల్ 3 అత్తిపత్తి మొక్క అయ్యింది! ఇందిరాగాంధీ చాలా ముందు చూపుతో - ఈ 'విడిపోని బంధం' వేసిందని కిరణ్ చెప్పింది అందుకే!

Article 371-D is beneficial for the ignored sections of society and and underdeveloped regions. Article 371-D is meant for unity and empowerment of the people. దీనిపై చర్చే లేకుండా, దీని మార్పు లేదా రద్దు వలన వచ్చే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అమాంతంగా, ఏకపక్షంగా 371-డి ని తీసి చెత్తబుట్టలో వేసెయ్యడం లేదా పనికిమాలినదిగా మార్చెయ్యడం సాధ్యం కాదు. కోట్లాది ప్రజల తరతరాల హక్కులకు సంబంధించిన ఒక ఏర్పాటును - అమాంతంగా తొలగించి - ఆ ప్రజలను కాశ్మీర్ శరణార్దుల మాదిరిగా మార్చి, మీ చావు మీరు చావండని కుప్ప కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ అక్కుబచ్చి ప్రభుత్వం తరిమేస్తుందా?! Never!
Unlike ·  · Share · 9 hours ago

Strike period salary jaapyam

సమైక్య సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో ఆందోళన :

సమైక్యాంధ్ర కోసం సమ్మె చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం చిక్కుల్లో పడవేసే ధోరణిలో వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. సమ్మె కాలానికి వేతనం చెల్లించే విషయంలో అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో అక్కడి ఉపాధ్యాయుంతా ఒకేరోజు సమ్మెలోకి వచ్చి, ఒకేరోజు సమ్మె విరమించటంతో 151 జీవో ప్రకారం ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించింది.
సీమాంధ్రలో ఉపాధ్యాయులు విడతల వారీగా సమ్మెలో పాల్గొనటంతో ఏ ప్రాతిపదికన వేతనాలు చెల్లించాలనే అంశంపై విద్యాశాఖ డెరైక్టర్ న్యాయశాఖకు లేఖ రాసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల మధ్య జరిగిన సమావేశంలో సమ్మె కాలంలో కోల్పోయిన పని దినాలను భర్తీ చేస్తామనే ఒప్పందం జరిగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీవో విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే!

సమైక్యాంధ్రకు మద్దతుగా ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో మూడొంతుల మంది సమ్మెలో పాల్గొనగా ఒక వంతు పాఠశాలలకు హాజరయ్యారు.
ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు సమ్మె జరపగా సెలవు దినాలు పోను పనిదినాలు 33 రోజులుగా ఉన్నాయి. ఆయా రోజులకు గాను ప్రభుత్వం వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక జీవోను విడుదల చేయాల్సి ఉంది.
ఈ జీవో విడుదలకు న్యాయశాఖ అనుమతి కావాల్సి ఉండటంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ కావనే భయం ఉపాధ్యాయులను వెంటాడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆగస్టు 22 నుంచి కొంతమంది, ఆగస్టు 27 నుంచి మరికొందరు, సెప్టెంబరు 3 నుంచి అలాగే 11 నుంచి ఇంకొందరు ఉపాధ్యాయులు సమ్మెలోకి వచ్చి అక్టోబరు 10 వరకు ఉద్యమంలో కొనసాగారు. వీరిలో కొంతమంది అక్టోబరు ఒకటో తేదీనే సమ్మెబాట వీడి విధులకు హాజరయ్యారు. ఇలా విడతలవారీగా ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనటం, సమ్మె విరమించటం వల్ల వీరికి సమ్మె కాలంలో వేతనం ఎలా చెల్లించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మరిన్ని సందేహాలు...
ఉపాధ్యాయులు విడతలవారీగా సమ్మెలోకి రావటం, విరమించటంతో వారికి సీఎం ఇచ్చిన హామీ అమలు నేపథ్యంలో మరిన్ని సందేహాలు ఎదురవుతున్నాయి.

ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు సమ్మెలో పాల్గొనగా మరొకరు పాఠశాలను నడిపారు. పాఠశాల తెరిచి ఉండటంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. ఉపాధ్యాయులు సమ్మె విరమించే సమయంలో సమ్మె జరిగిన 33 రోజులను రానున్న రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుడు పనిచేసి మరొకరు సమ్మెలోకి వెళితే ఆ పాఠశాల మళ్లీ 33 రోజులు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో 33 రోజులు పాఠశాలను అదనంగా పెడితే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తారా, దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
సమ్మె కాలంలో విధినిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు మళ్లీ పనిచేయాలా అనే ప్రశ్న కూడా వస్తోంది.
177 జీవో ప్రకారం ఉపాధ్యాయులు సమ్మె చేయడానికి వీలు లేదని.. నో వర్క్, నో పే అమలులో ఉంటుందని గతంలో హైకోర్టు స్పష్టం చేసినట్లు టీచర్లు చెబుతున్నారు.

సమైక్యాంధ్ర కోసం 33 రోజుల పని దినాల్లో ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వారికి వేతనం చెల్లించేందుకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచన చేయటం, ఈ అంశంపై వారు న్యాయశాఖ వివరణ కోరటంతో ప్రత్యేక జీవో విడుదల ఆలస్యమైందనే వాదన వినిపిస్తోంది.
న్యాయశాఖ ఈ అంశంపై పరిశీలన చేసిన అనంతరం సాధారణ పరిపాలనా విభాగానికి ఈ ఫైలు వెళ్లి ఆమోదం పొందిన తరువాతే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
2012 ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ ఒక్క రోజుకు సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనం చెల్లించలేదు. దీని కారణంగా ఉపాధ్యాయులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్ తదితర అంశాలన్నీ పెండింగ్‌లోనే ఉంచారు.
ఒక్కరోజు సమ్మె చేస్తేనే ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో 33 రోజుల సమ్మె కాలానికి ఉపాధ్యాయులకు వేతనం ఎలా చెల్లిస్తారు, దానికి సంబంధించి జీవో ఎలా విడుదల చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె విరమించేవరకు బుజ్జగించిన పాలకులు వేతనాలు చెల్లించే జీవో విడుదల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

UTF representation to give ON DUTY to strike period to CM CM

samme ...salary...go...?

Jai samaikyandhrapradesh

Tirupati hills

Jai samaikyandhra

11 October 2013

Rc. no. 1000 dt.11/10/2013 aided rationalization proceedings withdrawn

http://www.weebly.com/uploads/1/0/4/8/10482319/rc.no.1000_dt.11.10.2013_aided_rationalisation_proceedings_withdrawn.pdf                                                                                                                Rc.1000/B2-1/2010 Dated 11.10.2013- Aided Rationalisation 2013 Proceedings Rc.1000 Dated 19.8.2013 With Drawn. The Commissioner and Director of School Education has issued Proc Rc.1000 on 11th Oct 2013 on Aided -Rationalization of Aided Teachers in Aided Schools and informed all the Regional Joint Directors and District Educational Officers of all Districts that the Proceedings issued vide Rc.1000/B2-1/2010 Dated 19.8.2013 is Withdrawn. 
     In the Proc Rc.1000 Dated 19.8.13, the Director of School Education has issued instructions to take necessary actions to effect the promotions to the post of Head Masters in Aided Schools should follow the below Govt Orders / instructions.

  1. G.O.Ms.No.167 Education Dated 9.3.1984
  2. G.O.Ms.No. 66 Education Dated 15.6.2004

     But after the Issuing of Rc.1000 Dated 19.8.13, Unions have brought to the notice of C&DSE that Vide GO.167  issued on 9.3.84,  The Rules Issued were according to the Posts at that time and not applicable to present situation, as Panchayat Raj Services Rules separated Now. More Over Vide Memo.1518 Dated 8.5.1979, The Account Test exemption is cancelled for Head Master Post when candidate has crossed 45 Years. But the same exemption is reinstated vide GO. 184 Dated 15.3.1984. But this proceedings Rc.1000 is referring Memo.1518 for H.M Promotion in Aided Schools. Hence Unions demanded to Withdraw the Rc.1000 Dated 19.8.13 as it is referring Old outdated References to be taken in consideration for Promotion to the Post of Head Masters in Aided Schools.

Headmasters account test details and application 2013

http://bseap.org/images/appform20144.pdf

new logo of SSA to replace old logo in schools

veela maatladedi

see the difference

jai samaikyandhra

jai samaikyandhra

which is new state ?

how to get new cards if u lost ATM, PAN, DRIVIND LICENCE etc

andari Hyderabad

Cancer medicine for free

5 October 2013

Baboi congress

ఆంధ్ర ప్రదేశ్ విభజన చాలా బాధించింది. చాలా ఘోరం జరిగింది. రాజకీయ క్రీడ లో ఆరితేరిన కాంగ్రెస్ చాకచక్యాన్ని చూస్తుంటే భయమేస్తుంది. వంద సంవత్సరాలకు పైగా అనుభవమున్న పార్టి తన సామర్ధ్యాన్ని చూపించింది . సర్వ సమర్ధులు దుర్మార్గులయితే అంతా అరిష్టమే.
నిజానికి విభజించడం కన్నా కలిపి ఉంచడం వల్ల రాష్ట్ర్రానికి మేలు జరుగుతుందని మీకు అమ్దరికన్న్కా ఎక్కువ తెలుసు.
మీకు నచ్చింది. అంతే ! చేసేసారు .
చేయకూడదు అనుకుంటే ఇంతకన్నా సులువుగా ఆపగలిగి ఉండేవారు.
ఎందుకిలా చేసారు?
మీకు ఎన్నికల్లో గెలవగలిగే రకరకాల పద్దతులు తెలుసుకదా... మేం ఎలాగు ఆపద్దతులు చూసి చూసి " ఇది ఇంతే " అని బాధపడడం కుడా మానివేశాం. అలా గెలిచే పద్దతులేమన్నా చేపట్టలేక పోయారా..?
... ...
బాబోయ్ ... మీ సమర్ధతా నైపుణ్యాలు చూస్తే... భయమేస్తుంది.
రేపటి నుండి చాలా మంది నాయకులు మీ పార్టి ని వదిలేస్తారు, మిమ్మల్ని కడిగేస్తారు, ఆవేశంతో ఊగిపోతారు, మీ పార్టీ కి వ్యతిరేఖంగా పనిచేస్తారు , ప్రజలకు బాసటగా మేమున్నాం అంటారు.
మరికొంతమంది మీరు ఎంత దారుణంగా ప్రవర్తించారో చెబుతూ మిమ్మల్నే చూపిస్తూ మీరే మీరే మీరే దీనికి కారణం అంటారు. మనసులో నవ్వేసుకొంటు ఉంటారు.
మళ్లి ...మీరే కదా ఎన్నికలలో పోటి చేసేది? మీ మీ పార్తిలే కదా పోటి చేసేది.?
మేమేమి చేయగలం? ఒడి పోవడం తప్ప? ఇంకెవరిని ఎన్నుకోగలం మిమ్మల్ని తప్ప?
ఎలక్షన్లయిన వెంటనే మళ్ళి మీ సొంత గూటికి మీ చిలకలోచ్చేస్తాయి.
....
.....
మేమేమి చేయగలం? ఏమి చేయగలం?
..
నవ సీమంద్ర నిర్మాతగా పేరు తెచ్చుకొనే అవకాశం వస్తుందనే ఆనందం ఒకరికి...
మన ముక్క మనకు తెచ్చాను కనుక నాకన్నా మీరెవరిని అందలం ఎక్కిస్తారు' అని సంబర పడిపోయే వారొకరు.
సాధారణ జనానికి ఎవరకి తెలియని ఎన్ని నిజాలు తెలియవు మీకు? రాష్ట్రాన్ని కలిపి ఉంచి వెనుక బడిన ప్రాంతాల్ని ఏరి ఏరి అభివృద్ధి చేయడం మీకు ఇంతకన్నా కష్టమా?
పోనీ , అభివృద్ధి కోసం పోరాటాలు చేయక పోయారా/ ప్యాకేజీలు ఇవ్వక పోయారా?

ఇదంతా మనది అనుకున్నాం ఇన్నాళ్ళు.
పెద్ద పరిశ్రమో మరొకటో విశాఖపట్నంలో వచ్చినా ఒకటే , హైదరాబాదులో వచ్చినా ఒకటే ...అసలు ఎప్పుడు వేరుగా చూడలేదు...
ఒక్కటిగా ఉన్నాం ...
ఒక్కటై నడిచాం....
తెలంగాణా సోదరీ సోదరులారా...
రెచ్చగొట్టబడిన మీ ఆవేశ కావేశాల వల్ల, ఎందరో రాజకీయ నాయకుల అధికార దాహం వల్లా వ్యూహాల వల్ల మనం విడదియబద్దాం సుమ్మీ!
...
( తెలంగాణలో సమైఖ్య భావాన్ని ఆలపించిన ఎందరో మహానుభావులకు వేల వందనాలు. )