Search This Blog

14 August 2015

UTF PRESS NOTE ON GO.53 dt.14/8/15 conversion of success schools


ప్రచురణార్ధం
3428 పాఠశాలను పూర్తి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలుగా మార్చుతూ
జి.ఓ.53 ఉత్తర్వు విడుదల  -యుటియఫ్‌
పాఠశాల విద్యాశాఖ 2015`16 విద్యా సంవత్సరంలో 3428 హైస్కూళ్ళను పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా మారుస్తూ జి.ఓ.ఎం.ఎస్‌.53, తేది:14.08.2015ను విద్యాశాఖ కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా  ఉత్తర్వు విడుదల చేశారు.
-2014 -15 డైస్‌ లెక్కల ప్రకారం మొత్తం 4976 ఉన్నత పాఠశాలల్లో (ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌) 3428 పాఠశాలల్లో ఇంగ్లీష్‌ తెలుగు మీడియం సమాంతర తరగతులు నిర్వహిస్తున్నారు.
-ఈ పాఠశాల్లో 13 లక్షల 39 వేల 180 మంది విద్యార్థుల వుండగా వీరిలో 4,20,066 (31.36%) మంది విద్యార్థుల ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు.
-గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రుల తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం కావాలని ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరుస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల పిల్లలకు సమాన అవకాశాల కల్పించడం కోసం 3428 పాఠశాలను పూర్తి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా మారుస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
-మొదటి విడతగా 100 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలను పూర్తి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా మారుస్తారు. ఈ పాఠశాలలో వున్నతెలుగు మీడియం తరగతులను 2 కి.మీ. లోపల వున్న హైస్కూళ్ళకు తరలిస్తారు.
-2 కి.మీ. లోపల ఉన్నత పాఠశాల లేకపోతే దగ్గరలోవున్న ప్రాథమికోన్నత పాఠశాలను హై స్కూల్గా అప్‌గ్రేడ్‌ చేసి తెలుగు మీడియం విద్యార్థులను ఆ పాఠశాలకు తరలిస్తారు.
-ఒక గ్రామ పంచాయితీలో/లోకేషన్‌లో వున్న బాలురు, బాలికల పాఠశాలల్లో ఒక దానిని పూర్తి ఇంగ్లీష్‌ మీడియంగా మారుస్తారు. రెండవది తెలుగు మీడియం పాఠశాలగా వుంటుంది.
-ఈ విద్యాసంవత్సరంలో ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చబడిన పాఠశాలో 6,7 తరగతులో ఇంగ్లీష్‌ మీడియం మాత్రమే బోధిస్తారు. 9,10 తరగతు రెండు మీడియంలో వుంటాయి. ఉపాధ్యాయును ఆ మేరకు సర్దుబాటు చేస్తారు.
-ఇంగ్లీష్‌ మీడియం నేపథ్యం ఉన్న ఉపాధ్యాయును ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళకు తరలిస్తారు.
- ఇంగ్లీష్‌ మీడియంలో బోధనా సామర్థ్యం పెంచేదానికి యునిసెఫ్‌, బ్రిటీష్‌ కౌన్సిల్‌, ఇంగ్లీష్‌ & ఫారన్‌ లాంగ్వేజ్‌ యూనివర్సిటీ, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ సహకారం తీసుకుంటారు.
-రాబోయే వేసవి సెవులల్లో వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
-రాబోయే డిఎస్సీలలో 3 స్థాయిల్లో ఇంగ్లీష్‌ మీడియం ఉన్న వారిని రిక్రూట్‌ చేస్తారు.
-ఇంగ్లీష్‌ ట్రైనింగ్‌ ఇచ్చేదానికి డైట్స్‌ సన్నాహాలు చేయాల్సి వుంటుంది.
-స్టాప్‌ ప్యాట్రన్‌ ప్రకారం స్థాయి పెంచిన అప్‌గ్రేడేడ్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు  టీచర్లను కేటాయిస్తారు.
-హైస్కూళ్ళలో స్టాప్‌ ప్యాట్రన్‌ ప్రకారం విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు.
-డిగ్రీ, పి.జి. స్థాయిలలో ఇంగ్లీష్‌ మీడియం నేపథ్యం వున్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలకు ప్రాధాన్యత ఇస్తారు.
-ఇంగ్లీషు బోధనలో ఉపాధ్యాయులకు విడతల వారీగా సంవత్సరంలో 15 రోజుల శిక్షణ యిస్తారు. ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు అవసరమైన పోస్టులు యివ్వబడతాయి, ఖాళీలు ఉంటే అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తారు.
పరీక్షా విధానంలో కూడా మార్పు
పరీక్ష విధానంలో కూడా మార్పు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6,7,8 తరగతల ఇంగ్లీషు మీడియం విద్యార్ధులు 75% తెలుగు మీడియంలోను, 25% ఇంగ్లీషు మీడియంలోను పరీక్షలు వ్రాయవచ్చు. 2016-17 సంవత్సరంలో 50% ఇంగ్లీషు మీడియం, 50% తెలుగు మీడియంలోను, 2017-18 సంవత్సరంలో 75% ఇంగ్లీషు మీడియం, 25% తెలుగు మీడియంలోను పరీక్షలను వ్రాయవచ్చు. 9,10 తరగతల విద్యార్ధుల తెలుగు మీడియంలో పరీక్షలు వ్రాయవచ్చు. తెలుగు మీడియం చదవాలనుకొనే విద్యార్ధులు తెలుగు మీడియం పాఠశాలకు మారవలసి వుంటుంది.


                                                  (ఐ.వెంకటేశ్వరరావు)          (పి.బాబురెడ్డి)
                                                           అధ్యక్షులు               ప్రధానకార్యదర్శి

Sent from Samsung Mobile